Tuesday, 26 August 2014

Cell లో డాటాను మరియు ఫార్ములాను ఎంట్రీ చేయడం

ఏ Cell లో డాటాను ఎంట్రీ చేయాలో ఆ Cell ను క్లిక్ చేస్తే ఆ Cell thick border తో హైలెట్ అవుతుంది. ఆ Cell యొక్క Fixed Column మరియు Fixed Row హైలెట్ అవుతుంది. మీరు టైప్ చేస్తే ఆ టెక్ట్స్ డైరెక్ట్‌గా ఆ Cell లో టైప్ అవుతుంది. మీరు ఎంట్రీ చేసే టెక్ట్స్‌ను Excel అనలైజ్ చేసుకొని  టెక్ట్స్‌, నంబర్, డేట్ ఫార్మాటులో  ఆటోమెటిక్‍గా సెట్ చేసుకుని సెల్ ను జనరల్ ఫార్మాట్ లో పెట్టుకుంటుంది. మీరు ఎంటర్ చేసిన టెక్ట్స్ Cell విడ్త్‌ను దాటిపోతే ప్రక్కన ఉన్న Cell ఖాళీగా ఉంటే ఆ టెక్ట్స్ మిగితా సెల్స్ మీదుగా కనిపిస్తుంది. ఒకవేళ ప్రక్క సెల్‍లో ఏదైనా డాటా ఉంటే ఆ టెక్ట్స్ ఆ సెల్ విడ్త్‌లోనె దాచబడుతుంది. కానీ ఫార్ములాబార్ లో సెల్ లో ఉన్న డాటా మొత్తం కనిపిస్తుంది.





 Cell విడ్త్ ను మార్చడానికి fixed column బార్డర్ మీద మౌస్ పాయింటర్ తీసుకురాగానే పాయింటర్ Two Headed Arrow గా మారుతుంది. అప్పుడు మౌస్ ను క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే column width మారుతుంది. డ్రాగ్ చేయడానికి బదులుగా డబల్ క్లిక్ చేస్తే text length కు కాలమ్ విడ్త్ అడ్జస్ట్ అవుతుంది. అలాగే fixed row బార్డర్ మీద పాయింటర్ తీసువచ్చి డ్రాగ్ చేస్తే row height మారుతుంది. డ్రాగ్ చేయడానికి బదులుగా డబల్ క్లిక్ చేస్తే text length కు row height అడ్జస్ట్ అవుతుంది.




Enter ప్రెస్ చేస్తే సెల్ పాయింటర్ క్రిందకు మూవ్ అవుతుంది. అదే సెల్ లో ఉండాలంటే Ctrl+Enter ప్రెస్ చేస్తే సెల్ పాయింటర్ అదే సెల్ లో ఉంటుంది.

సెల్ లో ఉన్న డాటాను మార్చుకోవడానికి

సెల్ మీద డబల్ క్లిక్ చేసినా లేదా F2 ఫంకన్ కీ ప్రెస్ చేసినా సెల్ ఎడిట్ మోడ్ లోకి వస్తుంది. అపుడు డాటాను మార్చుకోవచ్చు. లేదా సెల్ ను సెలెక్ట్ చేసుకొని Formula Bar లో క్లిక్ చేసి కూడా ఎడిట్ చేసుకోవచ్చు.




No comments:

Post a Comment