Microsoft Excel ఒక Spreadsheet Software, ఇది Microsoft Office లోని ఒక Application Software. దీనిని ఉపయోగించి రోజూ వారి లెక్కల నుండి Office అకౌంట్స్ వరకు, డాటాను ఎనలైజ్ చేయడానికి, చార్ట్స్ క్రియేట్ చేయడానికి, డాటాబేసెస్ క్రియేట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి ఉపయోగిస్తారు.
Spreadsheet లో డాటాను స్టోర్ చేసుకొవడానికి, ఆర్గనైజ్ చేసుకోవడానికి మరియు మార్చుకోవడానికి ఉపయోగిస్తారు.
Excel screen చూడడానికి Table లా లేదా rows మరియు columns కలిసిన grid లా కనిపిస్తుంది. horizontal rows ను 1,2,3 అని సూచిస్తారు. vertical columns ను alphabet (A,B,C) అని సూచిస్తారు. row మరియు column కలిసే దానిని Cell అని అంటారు. column మరియు row లను కలిపి cell name ను సూచిస్తుంది. ఉదా. A1, A2,B1,B2,C1,C2. Cell లో మీరు ఎంట్రీ చేసే డాటాను స్టోర్ చేసి ఉంచుతుంది.
Microsoft Excel 2007 లో క్రొత్త ఫీచర్స్ చాలా ఆడ్ చేశారు.
- Office Button ను, Quick Access Toolbar ను , Ribbon ను, Dialog Launcher ను , Mini Toolbar ను క్రొత్తగా పరిచయం చేసారు.
- Menu ను Tab రూపంలో ఇచ్చారు. ప్రతి Tab దానికి సంబందించిన commands ను Ribbon లో సెక్షన్స్ వైజ్ గా Groups చేసారు.. Group లో చివరలో ఉన్న చిన్న సింబల్‍ను Diagonal Launcher అని అంటారు. దీనిని క్లిక్ చేస్తే Group కు సంబంధించిన Dialog box ను ఓపన్ చేస్తుంది.
- మీరు Styles మరియు Formats మారుస్తున్నప్పుడు Live Preview ను చూసుకొని మార్చుకోవచ్చు.
- Worksheet Page layout view చూసుకోవడానికి Page Layout ను Status Bar లో కుడివైపున ఇచ్చారు.
- Worksheet ను Zoom చేసుకోవడానికి Zoom Slider Status Bar లో కుడివైపున ఇచ్చారు.
- File .xlsx extension తో save అవుతుంది. పాత వర్షన్లలో .xls extension తో సేవ్ అయ్యేటివి.
Quick Access Toolbar లో మీరు తరచుగా ఉపయోగించే commands పెట్టుకోవచ్చు.

No comments:
Post a Comment