Thursday, 21 August 2014

MS Word 2007 పరిచయం (Video)



లెటర్స్, డాక్యుమెంట్స్, బుక్స్, మెయిలింగ్ లేబల్స్, మెయిల్ మెర్జ్ మొదలగు వాటిని తయారుచేసుకోవడానికి సర్వ సాధాణంగా Microsoft Word ను ఉపయోగిస్తూ ఉంటారు. Microsoft Office Suite లోని ఒక అప్లికేషన్ సాఫ్ట్‌వేరే ఈ MS Word. Microsoft Word 2007 ను ఓపన్ చేయడం Start Menu → All Programs → Microsoft Office → Microsoft Office Word 2007 క్లిక్ చేస్తే MS Word ఓపన్ అవుతుంది. MS Word విండో ఈ విధంగా కనిపిస్తుంది. Microsoft Word 2007 లో క్రొత్త ఫీచర్స్ చాలా ఆడ్ చేశారు.
  • OfficeButton ను, Quick Access Toolbar ను , Robbon ను, Dialog Launcher ను, Mini Toolbar ను క్రొత్తగా పరిచయం చేసారు.
  • Menu ను Tab రూపంలో ఇచ్చారు. ప్రతి Tab దానికి సంబందించిన commands ను Ribbon లో సెక్షన్స్ వైజ్ గా Groups చేసారు.. Group లో చివరలో ఉన్న చిన్న సింబల్‍ను Diagonal Launcher అని అంటారు. దీనిని క్లిక్ చేస్తే Group కు సంబంధించిన Dialog box ను ఓపన్ చేస్తుంది.
  • మీరు Styles మరియు Formats మారుస్తున్నప్పుడు Live Preview ను చూసుకొని మార్చుకోవచ్చు.
  • Document Page layout view చూసుకోవడానికి Page Layout ను Status Bar లో కుడివైపున ఇచ్చారు.
  • Document ను Zoom చేసుకోవడానికి Zoom Slider Status Bar లో కుడివైపున ఇచ్చారు.
  • File .docx extension తో save అవుతుంది. పాత వర్షన్లలో .doc extension తో సేవ్ అయ్యేటివి.
Office menu లో ఫైల్స్ ను నిర్వహించే commands ఉంటాయి. Quick Access Toolbar లో మనం ఎక్కువగా ఉపయోగించే commands పెట్టుకోవచ్చు. Menu ను Tab రూపంలో ఇచ్చారు. ప్రతి Tab దానికి సంబందించిన commands ను Ribbon లో Groups గా చూపిస్తుంది. Group లో చివరలో ఉన్న చిన్న diagonal arrow symbol, Group కు సంబంధించిన Dialog box ను ఓపన్ చేస్తుంది. Zoom slider ద్వారా డాక్యుమెంట్ ను Zoom చేసుకోవచ్చు.

 Document working area ను పెంచుకోవడానికి Ribbon ను minimize చేసుకోవచ్చు, Tab మీద రైట్ క్లిక్ చేసి Minimize the Ribbon ను క్లిక్ చేయాలి. Ribbon hide అవుతుంది. Tab ను క్లిక్ చేసినప్పుడు Ribbon ను temporary చూపిస్తుంది.

 Ruler ను చూపించడానికి లేదా దాచిపెట్టడానికి vertical scroll bar మీద ఉన్న View Ruler బటన్ ను క్లిక్ చేయాలి.              



    

No comments:

Post a Comment