Thursday, 21 August 2014

Computer Introduction (video) - in Telugu


కంప్యూటర్‌ అంటే ఏమిటి?

కంప్యూటర్‌ మెమోరీలో నిల్వ చేసిన సూచనల ప్రకారం పని చేసే ఒక యంత్రం.

కంప్యూటర్‌ ఎలా పని చేస్తుంది?

ఇన్‌పుట్‌ పరికరాల ద్వారా మనం ఇచ్చే డేటా(సమాచారం)ను తీసుకుని దానిలో స్టోర్‌ చేసి ఉన్న నిర్థిష్ట సూచనల ఆధారంగా డేటాను ప్రాసెస్‌ చేసి మమోరీ లేదా స్టోరేజ్‌ యూనిట్‌ నుండి డేటాను పంపడం లేదా తీసుకోవడం చేస్తూ, ప్రాసెస్‌ చేసుకొని అవుట్‌పుట్‌ను అవుట్‌పుట్‌ పరికరాల ద్వారా అందిస్తుంది. ఇన్‌పుట్‌ పరికాలు: కంప్యూటర్‌కు డేటాను పంపించే పరికరాలు. ఉదా|| కీబోర్డ్‌, మౌస్‌, జాయ్‌స్టిక్‌, మైక్రోఫోన్‌, స్కానర్‌, వెబ్‌కామ్‌, .... అవుట్‌పుట్‌ పరికరాలు: కంప్యూటర్‌ ఇచ్చే డేటాను మనకు అందించే పరికరాలు. ఉదా|| మానిటర్‌, ప్రింటర్‌, స్పీకర్‌, ... స్టోరేజ్‌ పరికరాలు: డేటాను స్టోర్‌ చేసుకునే పరికరాలు. ఉదా|| హార్డ్‌డిస్క్‌, సిడిరోమ్‌, డివిడి రోమ్‌, పెన్‌డ్రైవ్‌, మెమోరీ కార్డ్‌, .... కొన్ని ఇన్‌పుట్‌ మరియు అవుట్‌పుట్‌ పరికరాలుగా కూడా పనిచేస్తాయి. ఉదా|| టచ్‌స్క్రీన్‌, మోడెమ్‌, .... యూజర్‌: కంప్యూటర్‌కు సమాచారం ఇచ్చే మరియు కంప్యూటర్‌ ఇచ్చే సమాచారాన్ని ఉపయోగించే వ్యక్తి. కంప్యూటర్లలో మనం హార్డ్‌వేర్‌ మరియు సాఫ్ట్‌వేర్‌ అని వింటూ ఉంటాం.

హార్డ్‌వేర్‌

ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌, మెకానికల్‌ పరికరాలతో తయారు చేయబడిన దానిని హార్డ్‌వేర్‌ అని అంటారు. వీటిని తాకవచ్చు కూడా.

సాఫ్ట్‌వేర్‌

సాఫ్ట్‌వేర్‌ - ప్రోగ్రాం ఎలా పనిచేయాలో హార్ట్‌వేర్‌కు తెలియజేసే సూచనల హారం. అనేక ప్రోగ్రామ్స్‌తో కలిపి తయారు చేయబడిన దానిని సాఫ్ట్‌వేర్‌ అని అంటారు. అనేక కమాండ్స్‌తో కలిపి తయారు చేయబడిన దానిని ప్రోగ్రామ్‌ అని అంటారు. కంప్యూటర్‌ ఎలా స్పందించాలో(రెస్పాండ్‌ అవ్వాలో) తెలియజేసే సూచనలను కమాండ్స్‌ అని అంటారు.

సాఫ్ట్‌వేర్‌లో రకాలు

సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్స్‌: ఇది కంప్యూటర్‌ యొక్క సాఫ్ట్‌వేర్‌. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ను ఆపరేట్‌ చేయడానికి, కంప్యూటర్‌ మామూలుగా పని చేసేందుకు, అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్స్‌ను రన్‌ చేయడానికి ఉపయోగపడుతుంది. సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌లో ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌, డివైజ్‌ డ్రైవర్స్‌, సర్వర్స్‌, యుటిలిటీ ప్రోగ్రామ్స్‌ మొదలైనవి ఉంటాయి. ఉదా|| ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌: విండోస్‌ ఎక్స్‌పి, లైనక్స్‌, ఆపిల్‌ మాక్‌ ఓస్‌ ఎక్స్‌ .... డివైజ్‌ డ్రైవర్స్‌: మదర్‌బోర్డ్‌ డ్రైవర్స్‌, గ్రాఫిక్‌ కార్డ్‌ డ్రైవర్స్‌, .... సర్వర్స్‌: విండోస్‌ సర్వర్‌, విండోస్‌ ఎన్‌టి, సన్‌ సోలారిస్‌, .... యుటిలిటీ ప్రోగ్రామ్స్‌: మై కంప్యూటర్‌, కంట్రోల్‌ ప్యానల్‌, డిస్క్‌ డీఫ్రాగ్‌మెంటర్‌, డిస్క్‌ క్లీనప్‌, .... ప్రోగ్రామ్‌ సాఫ్ట్‌వేర్స్‌: ఉపయోగించి అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్స్‌, ప్రోగ్రామ్‌ సాఫ్ట్‌వేర్స్‌ మరియు సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్స్‌ను తయారు చేయవచ్చు. ఉదా|| సి, సి--, .నెట్‌, జావా, సి-, .... అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్స్‌: అవసరాలకు అనుగునంగా తయారుచేయబడే సాఫ్ట్‌వ్‌ర్స్‌ ఇవి. ఉదా|| మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌, ఇంటర్‌నెట్‌ బ్రౌజర్స్‌, గ్రాఫిక్‌ సాఫ్ట్‌వేర్స్‌, అకౌంటింగ్‌ సాఫ్ట్‌వేర్స్‌, ఆటోకాడ్‌, ....

No comments:

Post a Comment