డాటాను ఎడిట్ చేసేటప్పుడు డాటాను అటు ఇటు మార్చవలసి వస్తుంది లేదా ఒక ప్లేస్ లో ఉన్న డాటాను, ఫార్ములాలు, ఫార్మాట్స్, … మరో ప్లేస్ లో ఉపయోగించడానికి Clipboard గ్రూపులోని Cut, Copy, Paste కమాండ్స్ వాడతారు. Cut లేదా Copy చేసినపుడు Paste చేస్తేనే ఆ డాటా మరోచోటుకు మూవ్ లేదా కాపీ అవుతుంది.
Cut – డాటాను సెలెక్ట్ చేసుకొని Cut క్లిక్ చేసినా లేదా Ctrl+X కీస్ ప్రెస్ చేసినా ఆ సెల్(ల్స్) చుట్టూ డ్యాస్డ్ లైన్స్ చీమలు నడుస్తున్నట్టు కంటిన్యూస్ గా ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడ Paste (Ctrl+V) చేస్తే అక్కడి మూవ్ అవుతుంది.
Move – సెలెక్ట్ చేసిన సెల్(ల్స్) థిక్ బార్డర్ మీదకు ప్లస్ పాయింటర్ తీసుకురాగానే అది ఫోర్ హెడెడ్ పాయింటర్ గా మారుతుంది. అప్పుడు క్లిక్ చేసి కావలసిన ప్లేస్ కు డ్రాగ్ చేస్తే ఆ సెల్స్ అక్కడికి మూవ్ అవుతాయి.
Copy – డాటాను సెలెక్ట్ చేసుకొని Copy క్లిక్ చేసినా లేదా Ctrl+C కీస్ ప్రెస్ చేసినా ఆ సెల్(ల్స్) చుట్టూ డ్యాస్డ్ లైన్స్ చీమలు నడుస్తున్నట్టు కంటిన్యూస్ గా ప్రవహిస్తూ ఉంటాయి. ఎక్కడ Paste చేస్తే అక్కడికి కాపీ అవుతుంది.
Paste – Cut లేదా Copy చేసిన తరువాత అది మరోచోటుకు మూవ్ లేదా కాపీ కావడానికి తప్పుకుండా Paste చేయాలి.
Paste లో రెండు సెక్షన్స్ ఉంటాయి. Paste ఐకాన్ ను క్లిక్ చేస్తే అన్ని ఫార్మాట్స్ పేస్ట్ అవుతాయి. Paste డ్రాప్ డౌన్ లిస్టులో Formulas, Values, Borders, Transpose, Paste Special, Picture ఇలా రకరకాలుగా Paste చేసుకోవచ్చు.
Cut లేదా Copy చేసినపుడు డాటా Clipboard లో స్టోర్ అవుతుంది. Clipboard గ్రూపులో dialog launcher ను క్లిక్ చేస్తే clipboard టాస్క్ పేన్ ను ఓపన్ చేస్తుంది. దీనిలో ఉన్న డాటాను ఎన్నిసార్లైనా క్లిక్ చేస్తూ paste చేసుకోవచ్చు.


No comments:
Post a Comment