Tuesday, 26 August 2014

సిరీస్ లో ఉండే డాటాను ఆటోమెటిక్ గా ఫిల్ చేయడం - AutoFill (Video)




Excel ఉన్న మంచి ఉపయోగాలలో Auto Fill ఒకటి. మీరు ఏదైనా సిరీస్ టైప్ చేయవలసి వచ్చినపుడు మొత్తం టైప్ చేయవలసిన అవసరం లేదు. దీనిలోని Auto Fill Options ఉపయోగించి నంబర్స్, డేట్స్, మీరు డిఫైన్ చేసుకున్న సిరీస్, …  ను ఆటోమెటిక్ గా పూర్తి చేయవచ్చు.
సెల్ లో ఏదైనా డేట్ టైప్ చేసి Fill handler క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే డేట్స్ సిరీస్ తో ఫిల్ అవుతాయి. క్రింద Auto Fill Options smart tag కనిపిస్తుంది. దీనిని క్లిక్ చేసి ఫిల్ సిరీస్ ను మార్చుకోవచ్చు.




ఏదైనా నంబర్ లేదా డేట్ … టైప్ చేసి Editing గ్రూపులో Fill ను క్లిక్ చేసి సిరీస్ ను క్లిక్ చేసి Fill డయలాగ్ బాక్స్ లో Type లో Linear(Addition) లేదా Growth(Mulitplication) ను సెలెక్ట్ చేసుకొని Step Value ఎంత ఉంటుందో ఆ తేడాతో సెల్స్ సిరీస్ ను ఫిల్ చేస్తుంది. Stop Value సెట్ చేస్తే ఫిల్ సిరీస్ అక్కడి వరకే ఆగిపోతుంది.





సెల్ లో ఏదైనా నంబర్ టైప్ చేసి Fill handler ను క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అదే నంబర్ డ్రాగ్ చేసినంత వరకు ఫిల్ అవుతుంది. Ctrl కీ ప్రెస్ చేసి డ్రాగ్ చేస్తే సిరీస్ నంబర్స్ ఫిల్ అవుతాయి.
మీ సిరిస్ ను క్రియేట్ చేసుకోవడం
Office Button ను క్లిక్ చేసి Excel Options క్లిక్ చేస్తే Excel Options డయలాగ్ బాక్స్ ఓపన్ అవుతుంది. Popular టాబ్ లో Edit Custom Lists… బటన్ ను క్లిక్ చేస్తే Custom Lists డయలాగ్ బాక్స్ ఓపన్ అవుతుంది. Lists Entries లో మీ సొంత సిరీస్ ను ఎంటర్ కీ ప్రెస్ చేస్తూ ఎంట్రీ చేసి Add బటన్ ను క్లిక్ చేస్తే లిస్ట్ Custom list లో ఆడ్ అవుతుంది.
మీ worksheet లో ఎంట్రీ చేసి ఉన్న సిరీస్ ను Custom List లో ఆడ్ చేయడానికి
Import బటన్ ముందు ఉన్న సెలెక్ట్ బటన్ ను క్లిక్ చేసి worksheet లో ఉన్న సిరిస్ ను సెలెక్ట్ చేసుకొని ఎంటర్ కీ ప్రెస్ చేసి Import బటన్ క్లిక్ చేస్తే ఆ లిస్ట్ Custom list లో ఆడ్ అవుతుంది.






No comments:

Post a Comment