సెల్ ఇన్సర్ట్ చేయాల్సిన సెల్‍లో క్లిక్ చేసి, Homeటాబ్‍లో Cells గ్రూపులో Insert బటన్ (ఐకాన్ మరియు టెక్ట్స్) రెండు సెక్షన్స్ గా ఉంటుంది. ఐకాన్ ను క్లిక్ చేస్తే ఎన్ని సెల్స్ సెలెక్ట్ అయి ఉంటే అన్ని సెల్స్ లేదా ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ అయి ఉంటే అన్ని కాలమ్స్ లేదా ఎన్ని రోస్ సెలెక్ట్ అయి ఉంటే అన్ని రోస్ ఇన్సర్ట్ అవుతాయి. Insert టెక్ట్స్ ను క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ నుండి Insert Cells… క్లిక్ చేస్తే Insert డయలాగ్ బాక్స్ వస్తుంది.

Shift cells down – సెల్ ఇన్సర్ట్ అవుతూ కాలమ్‍లో ఉన్న మిగితా సెల్స్ క్రిందివైపుకు జరుగుతాయి.
Insert entire row – ఒక రో ఇన్సర్ట్ అవుతూ మిగితా రోస్ క్రిందివైపుకు జరుగుతాయి.
Insert entire column – ఒక కాలమ్ ఇన్సర్ట్ అవుతూ మిగితా కాలమ్స్ కుడివైపుకు జరుగుతాయి.
Insert టెక్ట్స్ ను క్లిక్ చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ లో
Insert Sheet Rows – సెలెక్ట్ అయినన్ని Rows ఇన్సర్ట్ అవుతాయి.
Insert Sheet Columns – సెలెక్ట్ అయినన్ని Columns ఇన్సర్ట్ అవుతాయి.
Insert Sheet – ఒక క్రొత్త Sheet ను Active Sheet ముందు ఇన్సర్ట్ చేస్తుంది.

No comments:
Post a Comment