Formulas క్రియేట్ చేయడం
మీరు worksheet లో డాటాను కాలిక్యులేట్ చేయడానికి ఉపయోగించబడే వాటిని ఫార్ములా అంటారు. ఫార్ములా “=” తో మొదలౌతుంది, వాల్యూస్(1,2,3..), సెల్ రిఫరెన్సెస్(A1,B1,…) మరియు మాథమెటికల్ ఆపరేటర్స్(+,-,*,…) ను ఉపయోగిస్తారు.ఉదా. =10+20
=5*30
=(A1+B1)*C1

మాథమెటికల్ ఆపరేటర్స్
| Operator | Description |
| + | Addition |
| - | Subtraction |
| * | Multiplication |
| / | Division |
| % | Percentage |
| ^ | Exponentiation |
కంపారిజన్ ఆపరేటర్స్
| Comparision Operator | Description |
| = | Equal to |
| < | Less than |
| > | Greater than |
| <= | Less than or Equal to |
| >= | Greater than or Equal to |
| <> | Not Equal to |
ఫార్ములాను ఎడిట్ చేయడం
ఫార్ములా ఉన్న సెల్ ను క్లిక్ చేసి ఫార్ములా బార్ క్లిక్ చేసినా లేదా F2 కీ ప్రెస్ చేసినా ఎడిట్ మోడ్ లోకి వస్తుంది. అప్పుడు ఫార్ములాను ఎడిట్ చేసుకోవచ్చు.కాలిక్యులేషన్ జరిగే ఆర్డర్
- Parentheses లో ఉన్న ఆపరేటర్స్ ముందుగా కాలిక్యులేట్ చేయబడతాయి.
- Percentage
- Exponentiation
- Multiplication & Division
- Addition & Subtraction
- Comparision Operators
Functions
ఫార్ములాస్ ను త్వరగా ఉపయోగించడానికి Excel లో చాలా built-in Functions ను ఇచ్చారు.ఫంక్షన్ ను ఇన్సర్ట్ చేయడం
ఫంక్షన్ ఎంటర్ చేయవలసిన సెల్ లో క్లిక్ చేసి ఫార్ములాబార్ లో ఉన్న Insert Function బటన్ ను క్లిక్ చేసినా లేదా Formulas టాబ్ లో Insert Function బటన్ క్లిక్ చేసినా సెల్ లో ముందుగా “=” వచ్చి Insert Function డయలాగ్ బాక్స్ ఓపన్ అవుతుంది. దీనిలో Category నుండి మీకు కావలసిన ఫంక్షన్స్ కేటగిరిని సెలెక్టు చేసుకొని క్రింద ఫంక్షన్ లిస్టు నుండి ఫంక్షన్ ను సెలక్ట్ చేసుకొని OK బటన్ క్లిక్ చేస్తే ఆ ఫంక్షన్ కు సంబంధించిన Function Arguments డయలాగ్ బాక్స్ ఓపన్ అవుతుంది. Argument లో insertion point ఉంచి సెల్ రిఫరెన్స్ టైప్ చేసినా లేదా worksheet లో సెల్ ను క్లిక్ చేసినా లేదా సెల్స్ రేంజ్ ను డ్రాగ్ చేసినా ఆ సెల్స్ Arguments లో ఆడ్ అవుతాయి. OK బటన్ క్లిక్ చేయగానే ఫంక్షన్ ఇన్సర్ట్ అవుతుంది.

సాధారణంగా ఉపయోగించే ఫంక్షన్స్
| Function | Description | Syntax |
| Sum | Adds all the number in a range of cells. | =Sum(number1, number2,…) |
| AVERAGE | Averages a series of arguments | =AVERAGE(number1,number2,…) |
| COUNT | Counts the number of cells in a range of cells that contain numbers | =COUNT(value1,value2,…) |
| Round | Rounds a number specified by the number of digits | =ROUND(number,number_digits) |
| MIN | Returns the smallest value in a series | =MIN(number1,number2,…) |
| MAX | Returns the largest value in a series | =MAX(number1,number2,…) |
| IF | Returns one of two results you specify based onwhether the value is TRUE or FALSE | =IF(logical_test,value_if_true,value_if_ false) |
| AND | Returns TRUE if all the arguments are true, FALSEif any are false | =AND(logical1,logical2,…) |
| OR | Returns TRUE if any argument is true and FALSEif all arguments are false | =OR(logical1,logical2,…) |
ఫంక్షన్ లో విడివిడిగా సెల్స్ ఇవ్వడం
ఫంక్షన్ లో సెల్స్ ను విడివిడిగా ఇవ్వడానికి “,”(కామా) ను ఉపయోగిస్తారు. ఉదా. =SUM(A1,B1,C1) ఈ ఫంక్షన్ =A1+B1+C1 మాదిరిగా పనిచేస్తుంది.ఫంక్షన్ లో రేంజ్ సెల్స్ ఇవ్వడం
ఫంక్షన్ లో సెల్స్ ను విడివిడిగా కాకుండా రేంజ్ వైజ్ గా ఇవ్వడానికి మొదటి సెల్ కు మరియు చివరి సెల్ కు మధ్యలో “:” (కోలన్) ను ఇస్తారు. ఉదా. =SUM(A1:C1) ఇది కూడా =SUM(A1,B1,C1) మాదిరిగానే పని చేస్తుంది.ఫంక్షన్ లో మార్పులు చేయడం
ఫంక్షన్ ఉన్న సెల్ ను క్లిక్ చేసి Insert Function బటన్ ను మళ్ళీ క్లిక్ చేస్తే Function Arguments డయలాగ్ బాక్స్ ఓపన్ అవుతుంది. దీనిలో Arguments ను మార్చుకొని OK బటన్ క్లిక్ చేస్తే ఫంక్షన్ ఎడిట్ అవుతుంది. లేదా F2 కీ ప్రెస్ చేసి సెల్ రిఫరెన్స్ ను సెలెక్ట్ చేసి మళ్ళీ మార్చవలసిన సెల్స్ ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది.Worksheet లో ఉన్న ఫార్ములాలను చూడడానికి Ctrl+` కీస్ ప్రెస్ చేస్తే షీట్ లో ఉన్న ఫార్ములాలన్ని కనిపిస్తాయి.
No comments:
Post a Comment