Monday, 25 August 2014

Shapes tutorial in Telugu (Video)

Shapes ను ఇన్సర్ట్ చేయడం, మార్చుకోవడం మరియు ఎఫెక్ట్స్ అప్లై చేయడం. ఈ క్రింది వీడియోలో వివరంగా చూడవచ్చు.


Word లో మీరు shapes గీయడానికి చాలా రకాల Predefined Shapes ఇచ్చారు. వీటితో మీకు కావలసిన షేప్స్ డ్రా చేసుకోవచ్చు మరియు వీటిని మీకు కావలసిన రీతిలో ఎడిట్ కూడా చేసుకోవచ్చు.
Insert టాబ్ లో Illustrations గ్రూపులో Shapes ను క్లిక్ చేస్తే Predefined shapes లిస్ట్ ను చూపిస్తుంది. దీనిలో మీకు కావలసిన Shape ను క్లిక్ చేస్తే పాయింటర్ + పాయింటర్ గా మారుతుంది. + పాయింటర్ ను document లో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే Shape డ్రా చేయబడుతుంది.



ఒరిజినల్ షేప్ డ్రా చేయడం – Shift కీ ప్రెస్ చేసి డ్రా చేయాలి.
Shapes ను ఫార్మాటు చేసుకోవడానికి Format టాబ్ Ribbon లో కనిపిస్తుంది.

Format టాబ్ లో

మరిన్ని షేప్స్ ఆడ్ చేయడం -  Insert Shapes గ్రూపు నుండి ఇంకా shapes ఆడ్ చేసుకోవచ్చు.
డ్రా చేసిన షేప్ ను మరో షేప్ గా మార్చడం – Edit Shape ను క్లిక్ చేసి Change Shape నుండి షేప్ ను మార్చుకోవచ్చు.
Text Box ను క్లిక్ చేసి షేప్ లో టెక్ట్స్ ను ఆడ్ చేయవచ్చు.




డ్రా చేసిన షేప్ ను మరో షేప్ గా మార్చడం – మార్చవలసిన షేప్ ను ముందుగా సెలెక్ట్ చేసుకొని Insert Shapes గ్రూపులో Edit Shape ను క్లిక్ చేసి Change Shape నుండి షేప్ ను క్లిక్ చేయగానే షేప్ మారిపోతుంది.




డ్రా చేసిన షేప్ ను ఎడిటింగ్ ఫ్రీఫాంగా మార్చడం – Convert to Freeform క్లిక్ చేస్తే ఒరిజినల్ షేప్ Freeform షేప్ గా మారుతుంది. Edit Shape లో Edit Points ను క్లిక్ చేస్తే షేప్ ను మార్చుకునేందుకు కొన్ని పాయింట్స్ షేప్ చుట్టూ కనిపిస్తాయి. వీటిని డ్రాగ్ చేస్తూ షేప్ ను మార్చుకోవచ్చు.




Shapes Styles గ్రూపులో Predefined Styles నుండి త్వరగా షేప్ స్టైల్స్ మార్చువచ్చు.


 WordArt Styles నుండి షేప్ లోని టెక్ట్స్ స్టైల్స్ ను మార్చవచ్చు.






No comments:

Post a Comment